Dec 09,2022 23:16

ప్రజాశక్తి - ఏలూరు
           సాయుధ దళాల పతాక దినోత్సవ నేపథ్యంలో జిల్లా సైనిక సంక్షేమాధికారిగా ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అత్యధిక నిధిని సమకూర్చడం స్ఫూర్తిదా యకమని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌ లో శుక్రవారం సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను గవర్నర్‌ సత్కరించారు. అనంతరం కలెక్టర్‌ హోం శాఖామంత్రి తానేటి వనిత అభినందించారు.