Apr 13,2023 00:04
ధర్నా చేస్తున్న ఏపీ జెఏసి అమరావతి ఉద్యోగులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసి చైర్మన్‌ సిహెచ్‌ సురేష్‌బాబు కోరారు. బుధవారం ఏపీ జెఏసి అమరావతి బాపట్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జేఏసీ భాగస్వామ్య సంఘా లు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం, ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాకు ఏపీ జేఏసి బాపట్ల జిల్లా చైర్మన్‌ సిహెచ్‌ సురేష్‌ బాబు, ప్రధాన కార్యదర్శి టి రజనీకాంత్‌, ఆర్టీసీ అసోసియేషన్‌ నాయకులు వై శ్రీనివాసరావు, కో ఆపరేటివ్‌ సంఘ అధ్యక్షులు కె మురళీ మోహన్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ ఇంజినీరిం గ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం డిఎ, పిఆర్‌సీ, అరియర్స్‌, ఇతర ఆర్థిక అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. జీతాలను సకాలంలో ఇవ్వాలని, రిటైర్డ్‌ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు ఇతర ఆర్థిక సౌకర్యాలను జాప్యం లేకుండా అందించాలని అన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ జెఎసి అమరావతిలోని భాగస్వామ్య సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాధ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ సిబ్బంది, సర్వే శాఖ సూపరింటెండెంట్‌ ఉద్యోగులు, కోఆపరేటివ్‌ సంఘ నాయకులు, విఆర్‌ఒ, విఆర్‌ఏ, ఆర్‌టిసి ఉద్యోగులు పాల్గొన్నారు.