అభివృద్ధి సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి - ఆదోని
ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొందరి వైద్యుల నిర్వాకం వల్ల చెడ్డ పేరు వస్తోందని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అభివృద్ధి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లింగన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చికిత్స కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోగులకు బెడ్ల కొరత రాకుండా, ప్రత్యామ్నాయంగా మంచాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యులు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఉన్నారు.










