Mar 11,2023 23:32

కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందజేస్తున్న గణపతి

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్‌.గణపతి శనివారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జనరల్‌ మేనేజర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతిపై చర్చించారు. విశాఖ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న ఆయనకు అల్లూరి జిల్లా జనరల్‌ మేనేజర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ముంచింగిపుట్టు మండలానికి చెందిన స్థానిక గిరిజనుడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు.