ప్రజాశక్తి -అనంతగిరి:మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి సచివాలయం సిబ్బంది హాజరు కాక వడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై మండలంలో పని చేస్తున్న సచివాలయం సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లతో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కలెక్టర్ సమాచారం అందించినప్పటికీ సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంతో ఆగ్రహ వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ నేరుగా మండల పరిషత్ కార్యాలయంలో సందర్శించినప్పటికీ ఏ ఒక్క సచివాలయం సిబ్బంది కూడా అప్పటికి కూడా హాజకాలేదు. మధ్యాహ్నం 2. గంటలకు సమావేశం నిర్వహించాలని భావించినా కలెక్టర్ తిరిగి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ అప్పటికైనా సిబ్బంది హాజరు కాలేదు. కలెక్టర్ ఆదేశాలకు బేఖతర్ చేస్తూ హాజరు కాకపోవడం పట్ల సిబ్బందిపై ఎటువంటి చర్యలు చేపడతారన్న దానిపై వేసి చూడవలసి ఉంది.
ఆసుపత్రి తనిఖీ
స్థానిక పిహెచ్‌సిని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి పరిశుభ్రత, రికార్డులను, వైద్య సిబ్బంది పనితీరు, రోగుల కు వైద్య సేవలు అందే తీరును వైద్య అధికారిణి జ్ఞానేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా రోగులు విశ్రాంతి తీసుకునే గది పరిశుభ్రతను, గర్భిణీల గదులను పరిశీలించారు. అప్తాల్మిక్ అసిస్టెంట్ లక్ష్మి విధులకు గైర్హాజరైనందున రెండు నెలలు జీతాలు నిలుపుదల చేయాలని వైద్య అధికారిణీని ఆదేశించారు. సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీలకు ప్రసవం జరిగేంత వరకు వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.. అనంతరం మూతపడిన హరిత హిల్ రెస్టారెంట్‌ను సందర్శించి భవనాన్ని పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, రెస్టారెంట్ మూసివేయడంతో భవనమంత పాడైందని దీనికి సంబంధించిన రికార్డులను ఏపీ టూరిజం శాఖ రెవెన్యూ అధికారులు వారం రోజుల్లోపు తమ కార్యానికి అందజేయాలన్నారు.
కలెక్టర్ కు సిపిఎం వినతులు
కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వివిధ సమస్యలపై వినతులు వెళ్లు వెత్తాయి. స్థానిక జెడ్పిటిసి గంగరాజు, సిపిఎం నేతలు అభివృద్ధి పనులపై లిఖితపూర్వకంగా విలవించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, అనంతగిరి పంచాయతీ లక్ష్మీపురం మెయిన్ రోడ్డు నుండి రాజుపాక గ్రామం వరకు, అనంతగిరి పెద్దూరు నుండి పాతకోట. మీదుగా రేగం. నుండి నందిగుమ్మి, లొంగపర్తి పంచాయతీ మెయిన్ రోడ్డు రింగ్ రోడ్డులను నిర్మించాలన్నారు.బొర్రా నుండి కోనపురం మీదుగా అరకు మండలం లోతేరు వరకు బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. ఫారెస్ట్ అధికారుల అభ్యంతరలతో నిలిచిన డేకపురం. బొంగిజా, ఓనుకొండ, శంకుపర్తి రోడ్లను తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరారు.
ఎంపీపీ నీలవేణి మాట్లాడుతూ ఆసుపత్రులలో గర్భిణీలకు భోజన సదుపాయం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎస్ .నాగులు, జె.సుబ్బారావు, ఉప తహసిల్దార్ వై.పాత్రుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










