ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలో అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఉదయం 11 గంటల సమయంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సందర్శించారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరు అందుబాటులో లేక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సిబ్బంది ఒక్కొక్కరు కార్యాలయంలో హాజరయ్యారు. సిబ్బందితో మాట్లాడిన తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించి గిరిజనులకు అందుతున్న వైద్యంపై అక్కడి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల గదిని పరిశీలించారు. ఇద్దరు వైద్యాధికారులు ఉండగా మరొక వైద్యాధికారి విధులకు ఎందుకు హాజరు కాలేదని కలెక్టర్ ప్రశ్నించారు. మరొక వైద్యాధికారిని ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా బిల్లాపూట్టు గ్రామంలో పాల్గొన్నారని చెప్పడంతో, వెంటనే అక్కడికి వెళ్లి విద్యాధికారిని హాజరయ్యారా లేదా అని పరిశీలించారు.
నిత్యం విధుల్లో సమయపాలన పాటించనీ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో గుండెల్లో దడ మొదలైంది. సమయపాలన పాటించనీ రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై మండల వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.










