
ప్రజాశక్తి-గుంటూరు : ది ఇంటర్నేషనల్ వియన్నా ఎనర్జీ అండ్ క్లైమేట్ ఫోరం కాన్ఫరెన్స్‌లో భాగంగా గుంటూ రు నగర కమిషనర్ కీర్తి చేకూరి స్వీడన్‌లోని స్వీడిష్ ఎన్విరా న్మెంట్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లను యునిడో ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ, క్లీన్ సిటీలపై అక్టోబర్ 29 నుండి నవంబర్ 5 వరకు స్వీడన్, ఆస్ట్రియాల్లో కమిషనర్ పర్యటించారు. రీసర్చ్ ఇనిస్టిట్యూట్, ఎనర్జీ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న ఆధునిక విధానాలు, వ్యర్థాలు ఉత్పత్తయ్యే నివాసాలు, సంస్థల నుండి ప్లాంట్‌లకు వ్యర్థాలు తరలిం చడం, కార్మికులతో కాకుండా యంత్రాలతో వ్యర్థాలను తడి, పొడి, ప్లాస్టిక్, ఇతర వస్తువు లుగా వేరు చేయడం, వాటిని తిరిగి ఉపయోగపడే వస్తువు లుగా మార్చే విధానాన్ని పరిశీలించారు. అనంతరం నేరుగా ఇళ్ల నుండి వ్యర్థాల సేకరణ విధానాన్ని పరిశీలించారు. లింకోపింగ్ యూనివర్సిటీ బృందంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొన్నారు.