పజాశక్తి - ఏలూరు అర్బన్
ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, సిపిడిసి సభ్యుల ద్వారా కళాశాలలో మౌలిక వసతుల కొరత గురించి తెలుసుకున్న ఏలూరు శాంతినగర్ నివాసి విశ్రాంత ఇంజినీర్, సంఘ సేవకులు చందన విష్ణువర్ధనరావు తనవంతుగా విద్యార్థుల సౌకర్యార్థం రూ.2.7 లక్షల విలువైన 30 డెస్కులను కళాశాలకు గురువారం అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు, అధ్యాపకులు వి.వెంకట్రావు, ఎం.కృష్ణ చైతన్య, టివి దుర్గాప్రసాద్, చందన విష్ణువర్ధన్‌రావుకు కౄతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపికను అందించి శాలువాతో సన్మానించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ దాత ఔదార్యాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ మరింత మంది దాతలు కళాశాల అభివృద్ధి కోసం తోడ్పడగలరన్నారు. డిగ్రీ కళాశాల ఫర్నీచర్ అవసరాన్ని చెప్పిన వెంటనే స్పందించి తన సహకారాన్ని అందించిన చందన విష్ణువర్ధన్‌రావును సిపిడిసి సభ్యులు ఎల్.వెంకటేశ్వరరావు కొనియాడారు. సిపిడిసి కార్యదర్శి ఇ.రఘబాబు హర్షం వ్యక్తం చేశారు.










