Apr 26,2023 00:57
శమ్రదానంలో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చీరాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల జాతీయ సేవ విభాగం వారి వారోత్సవాల సందర్భంగా మంగళవారం కళాశాల పరిసర ప్రాంతాలు, జబ్బార్‌ కాలనీలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్‌ మొయిద వేణు గోపాలరావు తెలిపారు. ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రపరిచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమీకరించి రీసైక్లింగుకు పంపించారు. ఈ సందర్భంగా పరిసర గ్రామ ప్రజలకు స్వచ్ఛ భారత్‌ యొక్క ఆవశ్యకతను తెలిపారు. వివిధ రకాల వ్యర్థాలు ఎలా రీసైక్లింగ్‌ చేయాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం జాతీయ సేవా విభాగం ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ డి జ్యోతి స్వరూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.