May 19,2023 22:54

కమిషనర్‌ మహేష్‌కుమార్‌ను కలిసిన క్లాప్‌ డ్రైవర్స్‌, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ( క్లాప్‌) వాహన డ్రైవర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కమిషనర్‌ ఆర్‌ రావిరాల మహేష్‌ కుమార్‌ను కలిసి పుష్ప గుచ్ఛం అందించి, అనంతరం సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ క్లాప్‌ డ్రైవర్లకు నెలకు 11,364 రూ. మాత్రమే జీతం వస్తుందన్నారు. వారాంతపు సెలవులు అమలు చేయడం లేదని, జీతం కూడా చాలా ఆలస్యంగా వస్తోందన్నారు. యూనియన్‌ అధ్య క్షుడు ఎం. శివశంకర్‌ మాట్లాడుతూ డ్యూటీ లో చేరే ముందు నెలకు 15,000 ఇస్తారని చెప్పారని తెలిపారు. డ్రైవర్ల సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారం చేస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టి.గంగా ధర్‌, ఇస్మాయిల్‌, రాము, డి. వీరబాబు, కె.నాగబాబు, జె. విద్యాసాగర్‌, ఎం. అప్పన్న, బి. శ్రీకాంత్‌, గోవింద్‌, అప్పలరాజు, వీర్రాజు పాల్గొన్నారు.