Jun 05,2022 10:13

మన మూడోనేత్రమై
తిమిరాన్ని చేధిస్తుంది !
మన చేతికి ఆరోవేలై
దారి చూపిస్తుంది !
మౌనానికి రూపమిచ్చి
భావాలు పలుకుతాయి !
దాహార్తుల గొంతులను
కన్నీటితో తడుపుతాయి !
అక్షరాలను చమురుగా
జ్ఞానదీపాలను వెలుగిస్తాయి !
జానపదాలను లిఖిత
గేయాలుగా మలుస్తాయి !
ఎడారి మనస్సుల్లో
కవితా వసంతాల్ని
పూయిస్తాయి!
పీడితుల గొంతుల్లో
విప్లవగీతాలై
కదం తొక్కుతాయి!
అస్తమించని సూర్యుడై
ప్రపంచానికి వెలుగునిస్తాయి !

సురేంద్ర రొడ్డ,94915 23570.