ప్రజాశక్తి -భీమునిపట్నం భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ఎపిజె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కలాం విగ్రహానికి ప్రిన్సిపల్ పి.ఉమారాణి, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వైసీపీ ఆధ్వర్యంలో... : కళాశాల ప్రాంగణంలో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి మూడో వార్డు వైసిపి నాయకులు మైలపల్లి షణ్ముఖరావు, అల్లిపిల్లి నరసింగరావు, వాసుపల్లి కొండబాబు, కదిరి ఎల్లాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టిడిపి ఆధ్వర్యంలో... : టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు కాసరపు నాగరాజు, ఎం.సంజీవ్‌కుమార్, కొక్కిరి అప్పన్న, ఎస్ జోగారావు, గండిబోయిన పోలిరాజు, వియ్యపు పోతురాజు తదితరులు కాలేజీ ఆవరణలోని కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పిఎం పాలెం: చంద్రంపాలెం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో అబ్దుల్ కలాం విగ్రహానికి భీమిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు నాగోతి వెంకట సత్యనారాయణ, ఈగల రవి, దాసరి శ్రీనివాసరావు, గొల్లంగి ఆనందబాబు, నాగేశ్వరరావు, అచ్యుతరావు, రెడ్డి సత్యనారాయణ, బోయి వెంకటరమణ, నాగోతి సూర్య ప్రకాష్, గరే గురునాథ్ పాల్గొన్నారు.
పిఎం పాలెం : చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో కలాం విగ్రహానికి హెచ్‌ఎం యమ్.రాజబాబు, ఎ.జయప్రద, ఉపాధ్యక్షులు కె. పోలినాయుడు, కో ఆప్షన్ సభ్యులు పిళ్లా సూరిబాబు, ఇయ్యపు ఎర్రి నాయుడు, యన్. జ్యోతి, యమ్. శ్యామల, వైసిపి నేతలు పోతిన ప్రసాద్, యం. వి. రమణమూర్తి, బెల్లపు పాపారావు, పాఠశాల పి.డి.రాము పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ములగాడ : శ్రీహరిపురం ప్రాథమిక పాఠశాలలో అబ్ధుల్ కలాం చిత్రపటానికి సంఘ సేవకులు, వైసిపి నేత పెద్ది రెడ్ల నానాజీ ఆధ్వర్యంలో కనికెళ్ల అమ్మాజీ, కనికెల్ల వినీల, వి నాగేశ్వరరావు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు










