Apr 01,2023 16:25

కళాకారులను సన్మానిస్తున్న బ్రహ్మానంద ఆచారి

కళాకారులను ప్రోత్సహిద్దాం- బ్రహ్మానంద అచారి
ప్రజాశక్తి బనగానపల్లె

      కళాకారులను ప్రోత్సహిద్దామని జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జె ఎస్ బ్రహ్మానంద ఆచారి పేర్కొన్నారు .శనివారం మండలంలోని పలుకూరు గ్రామంలో బీరప్ప స్వామి దేవాలయంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె ఎస్ ఎస్ బ్రహ్మాండచారి ఆధ్వర్యంలో బీరప్ప స్వామి డోలు వాయిద్యం నేర్పించిన గురువు జంగిటి మద్దిలేటి అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా కళాకారులను సన్మానించారు . గురువు మద్దిలేటిని ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో బ్రహ్మాంద అచారి మాట్లాడుతూ భారతదేశ సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తున్నాయని తెలిపారు.  భారతీయ సాంప్రదాయాల అభివృద్ధికి కృషి చేస్తూ బీరప్ప డోలు వాయిద్యం  నేర్పిస్తున్న గురువును మేము సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.  బీరప్ప స్వామి ఆలయ అభివృద్ధికి  కృషి చేస్తున్న కురువ కులస్తులను  అభినందించారు. సన్మాన గ్రహీత మద్దిలేటి మాట్లాడుతూ తనను సన్మానించిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు బీరప్ప స్వామి ఈశ్వరుని ప్రతిరూపమని అందులో డోలు బీరప్ప స్వామి డోలు సాంప్రదాయం మా ఆచారమనితెలిపారు.   అనేక మందికి నేను డోలు వాయిద్యం నేర్పించడం జరిగినదనితెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు సుబ్బరాయుడు, మహేష్,  గాలేన్న, కురువ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.