Oct 26,2023 22:12

ప్రజాశక్తి - కడియం మండలంలోని మురమండలో కనకదుర్గమ్మ పల్లకీసేవ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. గత 11 సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్లో సంగీత వాయిద్య కార్యక్రమాలను అందిస్తున్న వెలగతోడు గ్రామానికి చెందిన సూర్య మ్యూజికల్‌ బ్యాండ్‌ కళాకారులు లంక సత్తిబాబు, ఏడిద రామారావులను ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రూ.68 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు యర్రంశెట్టి వీరబాబు, చాపా రాంబాబు, బుడ్డిగ సూరిబాబు, ధర్మవరపు శ్రీనివాస్‌, గుణ్ణం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.