Sep 14,2023 00:29

ప్రజాశక్తి - రేపల్లె
కక్ష సాధింపుతోనే జగన్ కుట్ర పన్నారని టీడీపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం అమ్మవారి ఆలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమం వదిలేసి ప్రతిపక్షంపై కక్షగట్టారని అన్నారు. జగన్‌కు ఉన్న అవినీతి బురదను అందరికీ అంటించాలనే ప్రయత్నమే స్కిల్‌డెవప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కాం సృష్టి అని అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని ఆరోపించారు. ఇసుక, మద్యం, గంజాయి, మట్టి, రేషన్ బియ్యం మాఫియా నడుస్తుందని అన్నారు. లోకేష్‌, చంద్రబాబులకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. వైసిపి పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధరరావు, జీవి నాగేశ్వరరావు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, టీడీపీ లీగల్ సెల్ నాయకులు ధర్మతేజ, కె వెంకటేశ్వరరావు, చింతారావు, యలవర్తి లక్ష్మీ, గౌరీ రామకుమారి పాల్గొన్నారు.