కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్ర పూరిత కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిపిఐ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, కావలి నియ్షెజవర్గ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, దమ్ము దర్గాబాబు, నరసింహారావు అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కక్షపూరితంగా, అవమానకరంగా అరెస్టు చేసి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. 40యేళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేసి జైలుకు పంపటం జగన్మోహన్ రెడ్డి నియంతపాలనకు పరాకాష్ట అన్నారు. పతిపక్ష పార్టీ నేతలపై వేదింపులు, కేసులు, అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం పోలీసు పహారాలో నడుస్తుందని, రాష్టంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్టలను నిర్వీర్యం చేస్తుందని, ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్రపూరిత కక్ష సాధింపు చర్యలను వెంటనే వైసిపి ప్రభుత్వం అపాలన్నారు. శాంతియుతంగా టిడిపి బంద్‌కు పిలుపునిస్తే, టిడిపి కార్యకర్తలను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేయటం, భయబ్రాంతులకు గురిచేసి యుద్ధ వాతావరణం సృష్టించారన్నారు.










