Oct 16,2023 20:32

ప్రజలకు తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పట్టణంలోని 1వ వార్డులో 'బాబుతో నేను' నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని ప్రజలతో కలిసి ప్రజావేదిక ద్వారా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికార వైసిపి వైఫల్యాలను, కక్ష సాధింపు చర్యల గురించి ప్రజలకు వివరించారు.