Sep 22,2023 00:55

ప్రజశక్తి - చీరాల
ఆర్టీసీ డిపో మేనేజర్ హయ్యార్ బస్సు డ్రైవర్ల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ హయ్యర్ బస్సు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో గురువారం ధర్నా నిర్వహించారు. హయర్ బస్సు డ్రైవర్లు ఎం శ్రీనివాసరావు, శివయ్యలను ఎలాంటి కారణం లేకుండా విధుల నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. డిఎం ఏకపక్ష చర్యలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. హయ్యర్ బస్సు డ్రైవర్లను తొలగించే అధికారం డిఎంకు లేదన్నారు. ఆర్టీసీ ఒప్పంద ప్రకారం బస్సులో ఏదైనా సమస్య ఉంటే బస్సు ఓనర్‌తో చర్చించాలని అన్నారు. నెల రోజుల క్రితం విజయవాడ నుంచి చీరాల వచ్చే హైయర్ బస్సులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు అదే బస్సు నడుపుతున్న శివయ్యపై అకారణంగా దాడి చేశాడని, దాడిని డిఎం శ్యామల ఖండించక పోగా దాడి గురైన వ్యక్తినే తప్పు బట్టి ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. ప్రతి మంగళవారం జరిపే గ్రీవెన్స్‌ని డిఎం నిర్వహించడం లేదన్నారు. వెంటనే తొలగించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎన్ బాబురావు, బి వెంకటేశ్వర్లు, హెయిర్ బస్సు వర్కర్  యూనియన్ అధ్యక్షుడు ఎర్రం నాగిరెడ్డి, ఎం శివయ్య, మాణిక్యరావు పాల్గొన్నారు.