
గుంటూరు : కిట్స్ ఇంజినీరింగ్ కాలేజిలో 2023-24 విద్యా సంవత్సరం బి.టెక్ మొదటి సంవత్స రం తరగతులు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కళాశాలలో నూతన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు. కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు, ఉపాధి అవకాశాలు అందించటమే లక్ష్యం కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయటానికి రకరకాల ఇన్నోవేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి వల్ల తమ కళాశాలకు జాతీయ స్థాయిలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు వచ్చిందన్నారు.కళాశాల సెక్రెటరీ కోయి శేఖర్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ క్రమశిక్షణతో విద్యను అభ్యసిసు ్తన్నారని, ఆధునిక పోకడలతో విద్యను అలక్ష్యం చేయకుండా మెలిగేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.హరిబాబు కోర్సులు, పరీక్ష విధానం, శిక్షణా తరగతుల గురించి వివరించారు.