Aug 11,2023 21:11

కిశోర్‌ను కలిసిన విజయచంద్ర

ప్రజాశక్తి - కురుపాం :  కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు వైరిచర్ల కిషోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ను కురుపాం కోట వద్ద పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కిషోర్‌ చంద్రదేవ్‌ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈయనతో పాటు పార్వతీపురం నియోజకవర్గ టిడిపి నాయకులు గొట్టాపు వెంకటనాయుడు తదితరులు ఉన్నారు.