Oct 26,2022 23:19

మాట్లాడుతున్న గిరిజన సంఘం నేత సురేంద్ర

ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: మండలంలోనివనుగు పుట్టు గ్రామంలో గిరిజన మహిళ సంఘం (ఐద్వా) ఉపాధ్యక్షురాలు కిముడు దేవి సంతాప సభ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, ఐద్వా గౌరవ అధ్యక్షులు జయ, జిల్లా ప్రధాన కార్యదర్శి హైమావతి, జిల్లా అధ్యక్షులు కౌసల్య హాజరయ్యారు. కిముడు దేవి మరణం ఎంతో బాధాకరమన్నారు. అనంతరం సంతాప సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, మహిళల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారని, మహిళల హక్కులు, చట్టాలకు గిరిజన ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గిరిజన మహిళలకు చైతన్య పరచాలని గుర్తు చేశారు. మహిళల హదయాలలో ఆమె చేసిన త్యాగాలు చిరస్థాయిగా నిలిచి పోతాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబన్నీ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, అధ్యక్షుడు నారాయణ, సిపిఎం మండల కార్యదర్శి భీమరాజు, లక్ష్మీపురం సర్పంచ్‌ త్రినాథ్‌, గాసిరం పాల్గొన్నారు.