May 23,2023 00:44

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: వైద్య రంగంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కిమ్స్‌ హాస్పిటల్‌ ఒంగోలు ఆధ్వర్యంలో ఇంకొల్లు మండలం గంగవరం సొసైటీ బిల్డింగ్‌ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. కంటికి సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్‌ పరీక్షలు, కిడ్నీ, విషజ్వరాలు లాంటి వ్యాధులకు వైద్యులు సూచనలు అందజేశారు. రోగ నిర్ధారణ జరిగిన 50 మంది పేషంట్లకు ఒంగోలు కిమ్స్‌ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ, ఈహెచ్‌ఎస్‌ కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరికీ కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తామని కిమ్స్‌ హాస్పిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ షేక్‌ రఫీ తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్‌ రామాంజనేయులు, రాణి, కిమ్స్‌ హాస్పిటల్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు చేశారు.
వైద్యసేవలందిస్తున్న కిమ్స్‌ డాక్టర్‌