ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
మండలంలోని ఇడుపులపాడులో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తమ హాస్పిటల్ ఎంతో మందికి సేవలందిస్తుందని హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ తెలిపారు. రెవరన్ జి సంజయ్ కుమార్, ఇడుపులపాడు పెద్దలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సహకారంతో లూధరన్ చర్చి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 225మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. గుండె, కిడ్నీ, విష జ్వరాలు వంటి వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రోగ నిర్ధారణ జరిగిన 45మంది పేషంట్లకు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ, ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని తెలిపారు. క్యాంపులో డాక్టర్ వినీల్, ఆప్తమాలజిస్ట్ రాణి పాల్గొన్నారు.










