Jul 29,2023 16:38

రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన టమోటాలు

ప్రజాశక్తి-మదనపల్లె రూరల్‌ :మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమోటా పంట దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్‌ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమోటా రూ.196 పలికింది. అత్యల్పంగా రూ. 140 ధర పలికింది. మార్కెట్‌కు రైతులు కేవలం 255 టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. మార్కెట్‌లో ఏ గ్రేడ్‌ కిలో రూ.160 నుంచి రూ.196, బి గ్రేడ్‌ రూ.120 నుంచి రూ.156 వరకు పలికిందని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు. బుధవారం రూ.168 పలికిన ధర.. ప్రస్తుతం రూ.196కి పైగా పలకడంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.