May 13,2023 01:17
వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి-చీరాల: కారంచేడు ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఇస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల మండలం కీర్తివారిపాలెంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 70 మందిని ఈ శిబిరంలో పరీక్షించారు. ఇరవై మందిని శస్త్ర చికిత్సల కోసం కారంచేడు కంటి ఆస్పత్రికి సిఫార్సు చేశారు. మిగిలిన వారికి వైద్య సలహాలు, మందులు ఇచ్చారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ గడ్డం శ్రీనివాసరావు సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో వై సుబ్బారావు, జి సుజాత, జి పృథ్వీరాజ్‌, ఐ వెంకట్‌, జి మణికంఠ, నాగరాజు, సాయికృష్ణ, ఉమాదేవి, లక్ష్మి పాల్గొన్నారు.