Oct 09,2023 20:27

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ

మదనపల్లె అర్బన్‌ : క్రీడల ద్వారా మానసిక ఆనందం తో పాటు శారీరక దధత్వం సాధ్యమని ఆర్‌డిఒ మురళీ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె జడ్‌పిహైస్కూల్‌ లో 67వ ఎస్‌జిఎఫ్‌ అంతర్‌ జిల్లా అండర్‌-19 బాలురు,బాలికల ఫుట్‌బాల్‌ పోటీల ముగింపు, బహుమతుల పంపిణీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమన్నారు. విద్యార్థులు తమ అభిరుచి మేరకు క్రీడలను ఎంచుకొని అద్భుతంగా రాణించాలన్నారు. విద్యతో పాటు అన్ని విభాగాల్లో రాణించినప్పుడే విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఎంఇఒ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిచారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధా నోపాధ్యాయులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.