ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
నగరంలోని వెలగపూడి రామకృష్ణ సిద్దార్ద ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న చెరుకూరి ఓల్గా మెమోరియల్ మినీ, కిడ్స్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన పోటీలలో ఆంధ్రప్రదేశ్‌కు కాంస్య పతకం లభించింది. ఇండియన్ రౌండ్ విభాగం ర్యాంకింగ్స్‌లో రాజస్తాన్ జట్టు బంగారు పతకం, మణిపూర్ పతకం వెండి పతకం సాధించగా ఆంధ్రప్రదేశ్ జట్టు మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. బాలికల విభాగంలో రాజస్తాన్, జార్ఖండ్ , మహారాష్ట్ర జట్లు వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించాయి. పోటీలు ఈనెల 16వ తేదీ వరకు జరుగుతాయని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. పోటీలకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సుమారు 250 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇండియన్ రౌండ్, రికర్వు, కాంపౌండ్ విభాగంలో పోటీలు జరుగుతాయని తెలిపారు.










