ప్రజాశక్తి - ఏలూరు టౌన్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన గురజా కనకదుర్గారావుకు రూ.పది లక్షల సిఎం రిలీప్ ఫండ్ మంజూరైంది. ఇటీవల దెందులూరు ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్యచౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి, సాయం చేయాలని బాధితుడు కోరాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంఎల్‌ఎ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో కనకదుర్గారావుకు శస్త్ర చికిత్స, వైద్య ఖర్చుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్ రూ.10 లక్షలు మంజూరు చేయించారు. ఈ చెక్కును పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎకి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొఠారు రామచంద్రరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










