Aug 12,2023 21:03

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పలాస : కిడ్నీ వ్యాధితో యువత మృత్యువాత పడుతున్నారని, కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం విస్మరించిందని కౌలురైతు సంఘం జిల్లా నాయకులు బమ్మిడి ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని గొల్ల మాకన్నపల్లి గ్రామానికి చెందిన రాపాక చినవెంకటరావు, మందస మండలం వరద రాజపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి స్పందన ఇటీవల కిడ్నీ వ్యాధితో మరణించారు. విషయం తెలుసుకున్న బమ్మిడి ఆనంద్‌, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు బొడ్డు వాసుదేవరావు, సిపిఎం నాయకులు ఎన్‌.మోహనరావు ఆ కుటుంబాలను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిడ్నీ రోగులను అందుకుంటున్నామని, రూ.10 వేలు పింఛను ఇస్తున్నామని గొప్పలు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో సక్రమంగా అందడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.