
నగదు ఇస్తున్న సంస్థ సభ్యులు
ప్రజాశక్తి-గొలుగొండ:ఆపదలో ఉన్న నిరుపేదలకి సహయం అందించడంలోనే తమకు సంతృప్తి వస్తుందని స్నేహంజలి ఫర్ ప్యూర్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి ఎం.చిట్టయ్య అన్నారు. గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో రెండు కిడ్నీలూ ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకొంటూ ఇబ్బంది పడుతున్న నిరుపేద జాగు సత్తిబాబుని పరామర్శించారు. స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ తరపున రూ.10వేల ఆర్థిక సహయం అందించారు. ఈ సందర్భంగా చిట్టియ్య మాట్లాడుతూ, ఈ సంస్థ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామ న్నారు. సంస్థ మహిళ ప్రతినిధి సూర్యకళ మాట్లాడుతూ భవిష్యత్‌లో నిరుపేదలని గుర్తించి తమకు తోచిన సహయం అందించడమే మా స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుజాత, నల్లయ్య పాల్గొన్నారు.