Jan 20,2023 23:05

ప్రజాశక్తి-ఎ.కొండూరు
జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుహాసిని ఏ కొండూరు మండలంలోని గిరిజన తండాలలో గిరిజనులకు కిడ్నీ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించేందుకు తండాలలో కళాజాత బృందాలు పర్యటిస్తున్నట్లు జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ ఎం సుహాసిని తెలిపారు. శుక్రవారం మండలంలోని దీప్లానగర్‌ మాన్సింగ్‌ తండాలలో నిర్వహించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు ఎఎ పరిస్థితుల్లో వస్తాయో వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు ఏమిటో కళాబందాల ద్వారా గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మండలంలోని రోజుకు రెండు గిరిజన తండాలలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. తండాలోనే కాక కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న గ్రామాల్లో కూడా కళాజాత బందాలు పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హాస్పటల్‌ డాక్టర్‌. ఆర్‌ దివిజా సూపర్వైజర్‌ బాలమురళీకష్ణ ల్యాబ్‌ టెక్నీషియన్‌ వై శ్రీనివాసరావు ఏఎన్‌ఎంలు ఎమ్‌ఎల్‌ హెచ్‌ పి లు ఆశా వర్కర్లు హాస్పటల్‌ సిబ్బంది పాల్గొన్నారు