ప్రజాశక్తి-భవానీపురం: కిడ్నీ మార్పిడి కేసులో నలుగురు నిందితులను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం భవానీపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ ఏసీపీ డాక్టర్ కె. హనుంమతరావు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో భవానీపురంకు చెందిన కాటి కార్తీక్, కాటి నాగమణి, తమ్మిశెట్టి వెంకటయ్య , వనమాల కనకమహాలక్ష్మీలను అరెస్టు చేశారు. కార్తీక్ తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిచేంవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తనకు తెలిసిన వారి ద్వారా కిడ్నీ మార్పిడిలో మధ్యవర్తిగా వ్యహరించే బాబూరావును పరిచయం చేసుకున్నాడు. అతని వద్ద కొన్ని రోజులు జీతంకు పనిచేశాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా దీపక్ రెడ్డిె (కిడ్నీ రిసీవర్)ని పరిచయం చేసుకుని కిడ్నీ ఇచ్చినందుకు గాను రూ.29 లక్షలు ఒప్పందంగా కుదర్చుకున్నాడు. తనకు తెలిసిప కనకమహాలక్ష్మీని సంప్రదించాడు. గాడు చిన్నా అను మహిళకు ఎక్కువ డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పంచారు. దీనికి గాను ఆ మహిళాకు రూ.80 వేలు నుండి రూ.లక్ష వరకు తీసుకుంది. వైద్య ఖర్చులకు రూ.3.50లక్షలు తీసుకున్నారు. దీపక్‌రెడ్డికి తనకు అన్నయ్య అవుతాడని తప్పుడు పత్రాలను సృష్టించి ఆర్జీ పెట్టుకున్నారు. అదేవిధంగా రెండు నెలల క్రితం మరోక మహిళ సత్యవతి (కిడ్నీ రిసీవర్) కిడ్నీ కావాలని బాబూరావును ద్వారా కార్తీక్‌కు పరిచయమైన రాజేశ్వరి అనే మహిళ ద్వారా కార్తీక తన భార్య నాగమణి ద్వారా ఇంటి పక్కన నివాసించే తమ్మిశెట్టి వెంకయ్యతో విషయం చెప్పి భార్యకు మాయమాటలు చెప్పి కీడ్నీ మార్పిడికి ఒప్పంచాడు. ఈ క్రమంలో కిడ్నీ ఇచ్చేందుకు ఫ్యామిలీ సర్టిఫికెట్, రెసిడెన్స్ తప్పుడు పత్రాలతో ఆర్జీ పెట్టారు. ఈ పత్రాలపై అనుమానం వచ్చిన పశ్చిమ తహసిల్ధార్ లక్ష్మి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు కిడ్నీ రాకెట్ వ్యవహరాన్ని గుట్టురట్టు చేసి నలుగురుని భవానీపురం షాదీఖానా వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎసిపి హనుమంతరావు తెలిపారు. ఈ సమావేశంలో భవానీపురం సీఐ అబ్దుల్ సలాం, ఎస్త్సెలు రామారావు, లలాం ప్రసాద్ పాల్గొన్నారు.










