ప్రజాశక్తి-జగ్గయ్యపేట
జగ్గయ్యపేట మండల కెవిపిఎస్ మహాసభ సోమవారం మండలంలోని చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో అంబోజి విద్యాసాగర్ అధ్యక్షున జరిగింది. ఈ మహాసభకు ఎన్టీఆర్ జిల్లా కెవిపిఎస్ కార్యదర్శి జి నటరాజు, అధ్యక్షులు ఎం కుటుంబరావు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నటరాజు మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలంలో దళిత ప్రజలు సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని, పలు దళిత గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, స్మశానాలు లేని గ్రామాలు అధికంగా ఉన్నాయని, వాటి కోసం కెవిపిసిఎస్ మండలంలో గతంలో అనేక పోరాటాలు చేసిందన్నారు. ప్రస్తుతం ఎన్నుకున్న నూతన కమిటీ దాడులు, హత్యలు, అత్యాచారాలు, కులవివక్ష సమస్యలపై, డప్పు కళాకారుల పెన్షన్ సమస్యల పరిష్క రాలకు మార్గదర్శకాలు, రూపకల్పన చేసేందకు నవంబరు 23, 24 తేదీలలో పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో జరుగుతున్న కెవిపిఎస్ 6 వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన మండలకమిటీని 21 మందితో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జుజ్జువరపు వెంకట్రావు, అధ్యక్షులుగా ఆదిమళ్ళఅబ్రహం, కార్యదర్శిగా పెద్దపొంగు లక్ష్మీనారాయణ (సెల్వ రాజు), ఉపాధ్యక్షులుగా వేమవరపు ఫ్రాన్సిస్, సహాయ కార్యదర్శిగా కూచిపూడి చిట్టి బాబు, కోశాధికారిగా దాములూరి నాగరాజు, సభ్యులుగా మార్కపుడి రవి, ఏల్పుల ప్రభుదాసు, యండ్రాతి ఆనందరావు, కేతిపల్లి నాగేశ్వరరావు, ఆదిమల్ల సుధాకర్, చుక్క వెంకటేశ్వర్లు, పరిశిల అబ్రహం, ఆళ్లూరి రవికుమార్, కొండ్ర వెంకటేశ్వర్లు, చెన్నూరు శ్రీహరి, అమ్మనబోయిన ఆదాం, నూకపోవు యేసు, బరిగెల శ్రీను లను ఎన్నుకున్నారు.










