Oct 20,2023 23:20

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అలాగే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దళిత ప్రజా వ్యతిరేక విధా నాలు అవలంబిస్తూ పరిపాలన చేస్తున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రాజేష్‌ అన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని తిలోదకాలిచ్చి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్‌ పోస్టులు ఎక్కడ భర్తీ చేయట్లేదని, ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటు వ్యక్తులకు కట్టబడుతుందన్నారు. లౌకిక రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని దేశవ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్రతరమైన మరియు ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల తర్వాత మన రాష్ట్రం ఉండటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. దళితులకు భూ పంపిణీ చేయాల్సిన న భూ చట్టాలను 9/77 అసైన్డ్‌ చట్టాలను కాలరాశి దళితులకు భూమి లేకుండా చేస్తున్నరన్నారు. భూస్వాములు ఆక్రమంలో ఉన్న భూమిని తీసుకుని ప్రజలకు పంచాలని అసైన్డ్‌ కట్ట సవరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని,ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని దానిలో దళిత సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలనిరాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ దాడులు హత్యలు స్త్రీల అత్యాచార్యుల కేసులను విచారించడానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కమిటీ సభ్యులు బుర్రె రాజు, పట్టణ కెవిపిఎస్‌ అధ్యక్షులు మిర్యాల ఆనంద్‌ బెనర్జీ, పట్టణ కమిటీ సభ్యులు శరత్‌ బాబు ,సిఐటియు పట్టణ కార్యదర్శి సిహెచ్‌ జయ రావు తదితరులు పాల్గొన్నారు.