
నినాదాలు చేస్తున్న కెవిపిఎస్ నాయకులు
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని కొంతలం గ్రామంలో ఎస్సీ కాలనీ డ్రైనేజీని శుభ్రం చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కేవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, కొంత కాలంగా ఎస్సీ కాలనీలో డ్రైనేజీ దుర్భరంగా ఉందన్నారు. డ్రైనేజీ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ లేకపోవడంతో వర్షం పడినప్పుడు నీరు ఇళ్లల్లోకి చేరుతుందన్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీని శుభ్రం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు కె.బాలరాజు పాల్గొన్నారు.