Nov 08,2023 21:12

దీక్షలను ప్రారంభిస్తున్న రాకోటి రాములు, జి. శ్రీనివాస్‌

ప్రజాశక్తి- దత్తిరాజేరు : తమ గ్రామానికి చెందిన కొండ భూముల వద్ద కృషి విజ్ఞాన కేంద్రాన్ని (కెవికె) ఏర్పాటు చేయవద్దని చిన్న చామలపల్లి గొర్రెల, మేకల పెంపకం ఉత్తిదారులు ఇంగిలాపల్లి సచివాలయం వద్ద బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, మాజీ ఎంపిటిసి మన్యాల ఎరుకునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిదారులని నాశనం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. జిల్లాలో అనేక ప్రాంతాలలో ఇప్పటికే సేకరించిన భూములలో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టలేదన్నారు. ఇప్పటికే సేకరించిన భూముల్లో కెవికె పెట్టుకోవాలని తమ భూములను వదిలేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంట పోయిన తిరుపతిరావు, శంకర్రావు, బొమ్మిడి లక్ష్మణ, బోను రాములమ్మ, ఆవాల గౌడమ్మ దీక్షల్లో కూర్చున్నారు. వీరికి మద్దతుగా గ్రామ వృత్తిదారులంతా పాల్గొన్నారు.