Apr 16,2023 22:46

 మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు :
తెలంగాణ రాష్ట్రం లో కేసిఆర్‌ కుటుంబ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన అనుచరులతో కలిసి శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ చెన్న కేశవ రావు ధర్మకర్తలు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం సత్కరించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన నాయకులు వెంకట్రావు నిర్వహించిన ఫంక్షన్లకు హాజరు అయ్యారు. ఈసందర్భంగా విలేకరులతోమాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాలికలు సిద్దం చేయడం జరుగుతుందన్నారు. ప్రజల మనోభావాలను దష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తన అడుగులు వేస్తుమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసిఆర్‌ కుటుంబ పాలనపై ప్రజలు విసుగెత్తిరని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తన జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో స్ధానిక దేశం పార్టీ నాయకులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఆయన అనుచరులు పాల్గొన్నారు.