ఉంగుటూరు : నారాయణపురం అరవింద శత జయంతి ప్రభుత్వం డిగ్రీ కళాశాల, భీమడోలు లిక్సిల్ సానిటరీ వేర్ ఇండియా లిమిటెడ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్, ఎక్సెలరేషన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టికే.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి జీవిత లక్ష్య నిర్ధేశానికి అనుభవజ్ఞులైన సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లిల్సిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










