Apr 30,2023 17:16

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు ఎం.వెంకటసుబ్బారెడ్డి

కెరీర్ గైడెన్స్ పై  విద్యార్థులకు అవగాహన సదస్సు
ప్రజాశక్తి-డోన్

       కెరీర్ గైడెన్స్ పై 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏఐఎస్ఈసిటి ఆధ్వర్యంలో  అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట ప్రధానోపాధ్యాయురా లు పద్మావతమ్మ తెలిపారు.ఆదివారం డోన్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట నందు ప్రధానోపాధ్యాయురా లు పద్మావతమ్మ అధ్యక్షతన 10వ తరగతి చదివిన విద్యార్థులకు ఏఐఎస్ఈసిటి ఆధ్వర్యంలో వొకేషనల్ ట్రైనీ మహేష్,సీనియర్ ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి కేరీర్ గైడెన్స్ పై కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ కోర్సులో ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఇంటర్మీడియట్ కోర్సు,పాలిటెక్నిక్ కోర్సు, ట్రిపుల్ ఐటీ కోర్సుల పై అవగాహన కల్పించి  విద్యార్థులకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వెంకటరమణ, సుబ్బారాయుడు,అల్లిపీరా,ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.