ప్రజాశక్తి -అనకాపల్లి : సేవే పరమావధిగా భావించి సేవలందించే వారిలో కెప్టెన్ అప్పారావు ఒకరని మున్సిపల్ మాజీ చైర్మన్ కొణతాల జగన్నాధరావు నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక వివి రమణ రైతుభారతిలో కెప్టెన్ అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథరావునాయుడు మాట్లాడుతూ, చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన అప్పారావు ఆదర్శనీయులన్నారు. తాను రిటైర్ అయినా వయోవృద్ధుల సంక్షేమానికి సంస్థను స్థాపించి, నేటికీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా అప్పారావుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో హెల్ప్ లైన్ ప్రసాద్, విల్లూరి రాము, గంగుపాము నాగేశ్వరరావు, ఎఎంఎఎల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సరగడం నూకరాజు, బివి రమణ అప్పారావు, కెఎవి నారాయణరావు, రాపేటి నారాయణరావు, బొడ్డేడ అప్పారావు, మాజీ కౌన్సిలర్ కష్ణంరాజు, కే రమణ అప్పారావు, ఎం ఎన్ ఎస్ అప్పారావు, బుద్ధ అప్పారావు, కొణతాల నారాయణరావు, కాండ్రేగుల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.










