Jun 21,2023 19:28

బహుమతులు అందజేస్తున్న ఎపిజిబి మేనేజర్‌

ప్రజాశక్తి - హాలహర్వి
హాలహర్వి జడ్‌పి హైస్కూల్‌లో కెనరా బ్యాంకు వారి సహకారంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు బుధవారం 'ఆర్థిక అక్షరాస్యత'పై క్విజ్‌ పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి అర్ధగేరి జడ్‌పిహెచ్‌ స్కూల్‌కు చెందిన రవితేజ, మల్లికార్జున రూ.5 వేలు అందుకున్నారు. రెండో బహుమతి గూళ్యం జడ్‌పి హైస్కూల్‌కు చెందిన పల్లవి, సుప్రజ రూ.4 వేలు గెలుచుకున్నారు. మూడో బహుమతి హాలహర్వి జడ్‌పి హైస్కూల్‌కు చెందిన శ్రీలక్ష్మీ, గాయత్రి రూ.3 వేలు అందుకున్నారు. ఎపిజిబి హాలహర్వి బ్రాంచి మేనేజర్‌ జగదీశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన బహుమతులు అందజేశారు. ఎంఇఒ వీరన్న, ఎంఇఒ-2 శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.