జమ్మలమడుగు రూరల్ : స్థానిక ప్రొద్దుటూరు రోడులో ఉన్న కెనరా బ్యాంక్ యాజ మాన్యం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, బ్యాంక్ మేనేజర్‌ని సస్పెండ్ చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పేర్కొ న్నారు. శనివారం బ్యాంక్ వద్ద ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం నుండి శని వారం మధ్యాహ్నం వరకు కెనరా బ్యాంక్‌లో కరెంటు లేదని ఖాతాదారులను వెనక్కి పంపిస్తున్నారన్నారు. శనివారం ఉదయం నుండి ఖాతాదారులు బయట ఎండలో గంటల తరబడి ఉన్నాన్నారు. బ్యాంకు గేట్లు వేసి వారిని బయట వెయిట్ చేయించడం దారుణమన్నారు. జెనరేటర్ సౌకర్యం, బ్యాటరీ ఇన్వర్టర్ సౌకర్యం లేకపోవడం ఘోరమన్నారు. సమస్యపై ఖాతాదారులు అడిగితే బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా ముందు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండని వేటకారపు సమాధానాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బ్యాంకు మేనేజర్ మాత్రం ఉచిత సలహాలిస్తూ వ్యంగ్యంగా ఉన్నతాధికారులకు చెప్పాం.. తమకు సంబంధం లేదని చెబుతున్నారని విమర్శించారు.










