ముడసర్లోవ పార్కులో వైసిపి ఆత్మీయ సమావేశం
ప్రజాశక్తి- సీతమ్మధార :గడచిన ఎన్నికల్లో ఓటమి పాలైనా, వెనకడుగువేయకుండా అనునిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజాదరణ పొందుతున్న కెకె.రాజును ఉత్తర నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏడాదిన్నర ముందే సిఎం జగన్ ప్రకటించడం అభినందనీయమని పలువురు వైసిపి నేతలు అన్నారు. బుధవారం ముడసర్లోవ పార్కులో ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సంందర్భంగా ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా కెకె.రాజును ప్రకటించిన సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ కేడరంతా సమిష్టిగా కృషి చేసి, కెకె.రాజును మంచి మెజార్టీతో గెలిపించుకుని, ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని నిర్ణయించారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ ఎంపి ఎంవివి. సత్యనారాయణ, వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఎ.రెహ్మాన్, పంచకర్ల రమేష్‌బాబు, తైనాల విజరుకుమార్, కార్పొరేషన్ చైర్మన్లు సీతంరాజు సుధాకర్, చొక్కాకుల లక్ష్మీవెంకటరావు, కాయల వెంకటరెడ్డి పాల్గొన్నారు.










