ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందించాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ కె.వేణుగోపాల్ తెలిపారు. శనివారం విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి శనివారం కస్తూరిబా గాంధీ విద్యాలయాలను అకాడమిక్ ఆడిట్ చేస్తామని తెలిపారు. ఇతర రెసిడెన్షియల్ పాఠశాలలకు, కస్తూరిబా గాంధీ పాఠశాలలకు తేడా ఉందని చెప్పారు. వీరు బడి బయటి, అనాథ పిల్లలని, ఉత్తమ బోధన చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. 9వ తరగతి విద్యార్థులను బైజుస్ యాప్ వినియోగించుకునేలా చూడాలని సిఆర్‌పిలను ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా 8 అదనపు గదులు మంజూరయ్యాయని, వాటిలో 4 ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన గదులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష అధికారులు సునీత, మారుతి, ఎంఇఒలు రామాంజనేయులు, నీలకంఠ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ శ్రీనివాసరెడ్డి, కెజిబివి ప్రిన్సిపల్ విద్యావతి, సిఆర్‌పిలు రవికుమార్, గోవిందరాజులు, పుల్లన్న పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ అధికారితో మాట్లాడుతున్న వేణుగోపాల్










