ప్రజాశక్తి - శంఖవరం (అన్నవరం)
శంఖవరంలో ఉన్న కస్తూరిబా గాంధీ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పాఠశాల సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ వేసవి సెలవుల్లో తమ ఇళ్ల వద్ద ఏ విధంగా ఉండాలి భద్రత నియమాలు ఏ విధంగా పాటించాలన్న విషయాలపై వివరించారు. క్రమశిక్షణతో ఉండి పెద్దలకష్టం అర్థం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తుని తీర్చి దిద్దుకోవాలని వివరించారు. అనంతరం విద్యార్థులకు అందించే ట్యాబ్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలుసుకున్నారు 2023 అకడమిక్ సంవత్సరంలో ఆరో తరగతి, ఇంటర్‌లో ప్రవేశ విద్యార్థులు గురించి ఆరా తీశారు. తొలుత విద్యార్థులతో కలిసి పాఠశాలలో వండిన భోజనాలు రుచి చూసి సంతప్తి వ్యక్తం చేశారు కార్యక్ర మంలో జిసిడిఒ ఉమామహేశ్వరి, ఎంఇఒ వెంకట రమణ, ఎపిమోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కెజిబివి ప్రిన్సిపాల్ బి.బాలమణి, సిబ్బంది పాల్గొన్నారు.










