ప్రజాశక్తి-విఆర్.పురం : మండల కేంద్రం రేకపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని తక్షణమే పూర్తి చేయాలని ఎంపిపి కారం లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో భవన నిర్మాణానికి ఆర్‌విఎంఎస్‌ఏ నిధులు 59.64 లక్షలు 2020 సంవత్సరంలో మంజూరు కాగా, నిర్మాణం మొదలు పెట్టి మధ్యలో విడిచిపెట్టిన భవనాన్ని సోమవారం ఆమె స్థానిక సర్పంచ్ పూనెం సరోజిని, సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఒక వైపు ఈ విద్యా సంవత్సరం నుండి కెజిబివిలో ఇంటర్మీడియట్ తగతులు ప్రారంభించారని, చాలీ చాలని గదులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరైన నిధులతో అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, సచివాలయ ఇంజనీరింగు అసిస్టెంట్ కుంజా అరుణ్, పాఠశాల ఎస్‌ఓ సిబ్బంది పాల్గొన్నారు.










