కడప : లోక్‌అదాలత్‌కు వచ్చే వివిధ కేసులు ఎక్కువగా రాజీ అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గీత అన్నారు. ఈ నెల తొమ్మిదవ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజు అయ్యేవిధంగా చూడాలని ఎక్సైజ్ అధికారులు, చిట్‌ఫండ్ అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, నాల్గవ అదనపు జిల్లా జడ్జి, డిఎల్‌ఎస్‌ఎ చైర్మన్ జి.గీత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, డిఎల్‌ఎస్ సెక్రటరీ ఎస్.కవిత సూచించారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు, చిట్‌ఫండ్ అధికారులతో ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ జాతీయ న్యాయసేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. ఎక్సైజ్ అధికారులు చిట్‌ఫండ్ అధికారులు ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేవిధంగా విధంగా కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్, చిట్‌ఫండ్ అధికారులు పాల్గొన్నారు.










