Nov 08,2023 23:41

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: జైలు ముద్దాయిల కేసులు త్వరితగతన పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో అండర్‌ ట్రయిల్‌ ప్రిజనేర్స్‌ రివ్యూ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలు ముద్దాయిల కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు, ఎక్సైజ్‌ కేసుల పరిష్కా రంలో జాప్యం కూడదన్నారు. కేసులు విచారణ పూర్తి చేసి త్వరితగతను ఛార్జిషీట్‌ ఫైల్‌ చేయాల ని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు శ్రీదేవి, మహేంద్ర ఫణికుమా ర్‌, భాస్కరరావు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, డిఆర్‌ఒ గణపతిరావు, అడిషనల్‌ ఎస్‌పి తిప్పేస్వామి, జిల్లా జైలు సూపరింటెండెంట్‌ నబి ఖాన్‌, సబ్‌ జైలు అధికారులు, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ మెట్ట మల్లేశ్వరరావు పాల్గొన్నారు.