ప్రజాశక్తి - శ్రీకాకుళం: జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కావడం ద్వారా తక్షణ సహాయం అందుతుందని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. వచ్చే నెల 9వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల రాజీపై ఇన్సూరెన్స్ అధికారులు, మోటార్ వెహికల్ కేసుల పిటిషనర్ న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్‌తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటారు వాహన ప్రమాదాల్లో గాయపడిన, మృతి చెందిన వారి కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ కావడం ద్వారా తక్షణ సహాయం అందుతుందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, మోటార్ ప్రమాద కేసుల పిటిషనర్ అడ్వకేట్స్ ఎల్.గోవిందరాజులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్ మంచు జనార్థనరావు, పొన్నాడ వెంకటరమణారావు, ఎన్.వి శేషగిరిరావు, ఎస్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










