Aug 20,2023 20:46

మాట్లాడుతున్న ఎస్‌పి

ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఫాస్ట్‌ ట్రాక్‌ కేసులపై ఆదివారం ఎస్‌పి సమీక్ష నిర్వహిపంచారు. గుంటూరు రేంజ్‌ ఐజి జి.పాలరాజు,ఎస్‌.పి. డాక్టర్‌ కె. తిరుమలేశ్వర రెడ్డి, పాల్గొన్నారు. డి.జి.పి అదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ''కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌'' లో భాగంగా ప్రయారిటీ కేసులను(ఫాస్ట్‌ ట్రాక్‌ కేసులు) కోర్టులో ట్రయిల్‌ కు వచ్చి కన్విక్షన్‌ పడేంత వరకూ ప్రాధాన్యతతో మోనిటరింగ్‌ చేయాలని ఐజి జి.పాలరాజు ఎస్‌సి తిరుమలేశ్వరరెడ్డికి సూచించారు. జిల్లాలోని కేసుల ప్రాధాన్యతను బట్టి ప్రతి ఒక్కరు కొన్ని కేసులను స్వీకరించి వాటి ట్రైల్‌ లను ప్రతి ఎస్‌హెచ్‌ఓ, సిఐ, డిఎస్‌పిలు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. విచారణ అధికారులు తీసుకున్న ఫాస్ట్‌ ట్రాక్‌ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తు, ట్రయల్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను దర్యాఫ్తు అధికారులకు దిశానిర్దేశం చేశారు.